ఘనంగా వాల్మీకి జయంతి
మద్నూర్, బతుకమ్మ : మండల కేంద్రంలో మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవం మంగళవారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి ఆలయంలో వేదమంత్రోచ్చరణలతో అభిషేకం పూజలు, హరతీ మహోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు. వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కల్లుర్ అశోక్, యాజంప్ సాయిలు, నాందేవ్ మేస్త్రీ, యాదు మేస్త్రీ, రాహుల్, తులసి రాం, రాజు, సాహెబ్ రావ్, సాయిలు, లక్ష్మణ్, దేవిదాస్ తదితరులు...