వైశ్య ఉన్నత పాఠశాల కార్యవర్గ సమావేశం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇంగు శివప్రసాద్ అధ్యక్షతన నూతన వైశ్య ఉన్నత పాఠశాల లో శనివారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే రెండు సంవత్సరాలకు పాఠశాల అభివృద్ధి గురించి, మౌలిక సదుపాయాల ఏర్పాటు, విద్యా ప్రమాణాల పెంపు గురించి చర్చించారు. ఇంగు శివప్రసాద్ మాట్లాడుతూ కార్య వర్గ సభ్యుల సహకారంతో, ఆర్యవైశ్య పెద్దల సహకారంతో నూతన వైశ్య ఉన్నత పాఠశాలను, ఎంబీఎస్ఈ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ కొండ సత్య...