Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 8:19 pm Posted by : ramakrishna

విద్యా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి

 

. . . పీఆర్ టీయు జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

విద్యాశాఖలో ఖాళీగా ఉన్న డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈఓ పోస్టులను తక్షణమే భర్తీ చేసి, అర్హత గల అధికారులకు పదోన్నతులు కల్పించాలని పీఆర్ టీయు తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. ప్రస్తుతం 3 మంది అడిషనల్ కలెక్టర్లు, 3 మంది సీఈవో లు, ఒక డిఐఈఓ, ఒక పరిశ్రమల శాఖ అధికారి విద్యా శాఖలో డీఈవోలుగా పనిచేస్తున్న పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం 35 డిఈఓ పోస్టులకు నలుగురు రెగ్యులర్ డిఈఓ లు మాత్రమే ఉన్నారని, 62 డిప్యూటీ ఈవో పోస్టులకు నలుగురు మాత్రమే ఉన్నారని, 630 ఎంఈఓ పోస్టులకు 14 మంది మాత్రమే పని చేస్తున్నారని అన్నారు. విద్యా శాఖలో ఇంత భారీ స్థాయిలో ఖాళీలు ఉండడం అత్యంత ఆందోళనకర విషయమని, ఈ పరిస్థితులు విద్యా పరిపాలన పై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని తెలిపారు.