Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 4:37 pm Posted by : ramakrishna

తెయూలో లో ఖాళీగా ఉన్న పీజీ  సీట్లను భర్తీ చేయాలి

 

. . . బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు యెండల ప్రదీప్

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 125 పీజీ  సీట్లను భర్తీ చేయడానికి స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండల ప్రదీప్ ఆధ్వర్యంలో వీసీ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ యాదగిరికి వినతి పత్రం అందజేశారు. తెయూలో ప్రతి సంవత్సరం  వివిధ కోర్సులలో సీట్లు మిగిలిన అధికారులు భర్తీ చేయడానికి అవకాశం ఉన్న పట్టించుకోవడం లేదని,  తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలని, యేటా సీట్లు మిగిలి ఉన్న వాటికి స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ ప్రిన్సిపల్ రాంబాబుకు గతంలో వినతి పత్రం ఇచ్చినా ఎటువంటి స్పందన లేకపోవడంతో ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. వీసీ సానుకూలంగా స్పందించి త్వరలో సీట్ల భర్తీ  నిర్వహిస్తామని చెప్పడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేసి ధర్నాను విరమించారు ఈ  కార్యక్రమంలో నాయకులు సందీప్, ప్రశాంత్, నాగమణి,అనూష, సుజన, భాస్కర్, కృష్ణ ప్రసాద్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Vacant PG seats at the university should be filled