Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 6:43 pm Posted by : ramakrishna

పొదుపుగా నీటిని వాడుకోవాలి

 

. . . భూ గర్భ జల శాఖ ఉపసంచాలకులు పి. శ్రీనివాస్ బాబు

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

ఇంటి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణం చేసి, పొదుపుగా నీటిని వాడుకోవాలని భూగర్భ జల శాఖ ఉపసంచాలకులు పి శ్రీనివాస్ బాబు అన్నారు. నడిపల్లి గ్రామం లోని రైతు వేదిక లో భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో లైట్ ఫర్ బ్లైండ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సోమవారం ప్రపంచ నీటి దినోత్సవం – వాటర్ అండ్ జెండర్ విషయం పై కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూగర్భ జలాల వినియోగం, నిర్వహణ, నీటి సంరక్షణ పద్ధతుల గురించి రైతులకు వివరించారు. అనంతరం వ్యవసాయ, పరిశ్రమల శాఖ ద్వారా నీటి పొదుపు పద్ధతులు పాటించిన వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీవో, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ, అగ్రికల్చర్ ఏఓ, ఏపీఓ, సర్పంచ్, భూగర్భ జల శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.