Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 5:26 pm Posted by : ramakrishna

జె.సి.ఎస్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ సేవలను వినియోగించుకోవాలి

 

. . . జె.సి.ఎస్ ట్రస్టీ ఆకుల పాపయ్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ సేవలను వినియోగించుకోవాలని జే.సి.ఎస్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్రీ ఆకుల పాపయ్య అన్నారు. నగరంలో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్రీ సభ్యులు డా.రామ్మోహన్ రావు, డా.జయనీ నెహ్రు దంపతులు వందలాది పుస్తకాలను జెసియస్ ప్రసాద్ మెమోరియల్ లైబ్రరీ కి అందజేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఖలీల్ వాడి లో నిర్వహించిన సభలో ఆకుల పాపయ్య మాట్లాడుతూ కోటగల్లి లో ఉన్న జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ లైబ్రరీ లో ఎంతోమంది విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని, ఉపాధి అవకాశాలే కాకుండా శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవడానికి ఇక్కడ అనేక పుస్తకాలు దోహదపడుతున్నాయని అన్నారు. వేలాది పుస్తకాలు లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయని, వాటిని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, త్వరలో డిజిటల్ లైబ్రరీ చేయడానికి జెసిఎస్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. సభలో డా.సూరి మాట్లాడుతూ ప్రజలు పుస్తకాల ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల, యువకుల అవసరాలకు అనుగుణంగా గ్రంధాలయాన్ని అభివృద్ధి పరచాలని, అందుకు తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని తెలియజేశారు. డా.రామ్మోహన్ రావు, డా.జయనీ నెహ్రూ దంపతులు మాట్లాడుతూ జంపాల ప్రసాద్ గ్రంథాలయం అనేక సంవత్సరాలుగా నిజామాబాద్ వాసులకు విజ్ఞానాన్ని అందిస్తుందని గ్రంథాలయం, ట్రస్టు సేవలను కొనియాడారు. తాము భవిష్యత్తులో కూడా ట్రస్ట్ కి అండదండలందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు పరుచూరి శ్రీధర్, మీనా సహాని, ఇంజనీర్ రవికుమార్, ప్రజా సంఘాల నాయకులు అరుణ రేఖ, వేల్పూర్ భూమన్న, వనమాల సత్యం, జి.రమేష్, శివ కుమార్, జన్నారపు రాజేశ్వర్, జి.సంజన, పవన్, భవాని, తదితరులు పాల్గొన్నారు.

 

Use the services of J.C.S. Prasad Memorial Trust