ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలి
. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాధితులు అనవసరంగా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలు కావద్దన్నారు. ప్రభుత్వపరంగా అనేక ఆసుపత్రులు ఉత్తమ చికిత్సలు అందజేస్తున్నాయన్నారు. ...