Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 October 2025, 6:31 pm Posted by : ramakrishna

అయోడైజ్డ్ ఉప్పునే వాడండి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం అ ర్సపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ధర్మపురి హిల్స్ లో గల తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీ లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అయోడిన్ లోప రుగ్మతలపై, టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ పై, మానసిక రుగ్మతలపై, వ్యక్తిగత ఆరోగ్యం పోషకాహారం చేతుల శుభ్రత సీజనల్ వ్యాధులు, అసంక్రమిక వ్యాధులపై పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ శ్రావణ లక్ష్మి, డిహెచ్ఇ ఘన్పూర్ వెంకటేశ్వర్లు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోడైజ్డ్ ఉప్పు ఆరోగ్యానికి శ్రేయస్కరమని ఇది వాడడం ద్వారా అనేక లాభాలు ఉన్నాయని తెలియజేశారు. ముఖ్యంగా అయోడిన్ లోపం వల్ల విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి లోపించడం, సంగ్రహ శక్తి కోల్పోవడం, శారీరక మానసిక ఎదుగుదల లోపించడం, మరుగుజ్జుతనం,తక్కువ బరువుతో శిశువులు జన్మించడం, మృత శిశువుల జననం, థైరాయిడ్ గ్రంధిలో వాపు గాయిటర్ వ్యాధి రావడం, శరీర బరువు అధికంగా పెరగడం, ఏకాగ్రత లోపించడం, లాంటి అనర్ధాలు ఏర్పడతాయని అందువల్ల అందరూ తప్పకుండా అయోడైజ్డ్ ఉప్పు నే వాడాలని తెలియజేశారు. వంట చేసే పద్ధతుల ద్వారా అయోడిన్ లోపించకుండా వంట వండి చల్లారిన తర్వాత అయోడైజ్డ్ ఉప్పుని కలపాలన్నారు. అదేవిధంగా టొబాకో ఫ్రీ యూత్ క్యాంపేయిన్ కార్యక్రమం ను 60 రోజులు నిర్వహించడం జరుగుతుందని. ఇందులో అన్ని పాఠశాలలో కళాశాలలో పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కార్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థి దశ నుంచే పొగాకు ఉత్పత్తులు వాడడం ద్వారా విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం అవుతుందని మరియు శారీరక మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు గురయ్యా ఆస్కారం ఎక్కువగా ఉందని అన్నారు. విద్యార్థులు ఎవరు యాక్టివ్ స్మోకర్స్ కి దగ్గరగా వెళ్లకుండా వారు వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని తెలియజేశారు. విద్యార్థులు పాన్పరాగ్, గుట్కా, సిగరెట్ మరియు డ్రగ్స్ లాంటి వాటికి అలవాటు పడకుండా ఉండాలన్నారు. పొగాకు ఉత్పత్తులు మరియు డ్రగ్స్ ఇవి శరీరంలోకి తీసుకోవడం అంటే దేశంలోనికి ప్రవేశించే తీవ్రవాదులు లాంటివారని వీటి ద్వారా అనేక శారీరక మానసిక అనారోగ్యాలు, రుగ్మతలు సంభవిస్తాయన్నారు. మరియు వ్యక్తిగత పరిశుభ్రత పోషకాహారము రక్తహీనత చేతుల శుభ్రత మానసిక ఆరోగ్యం పై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సూర్యకాంతరెడ్డి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణ లక్ష్మి,  డిహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, పీహెచ్ఏన్ రాణి, ఏ ఏన్ యం అనిత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Use only iodized salt.