- పరిసరాలను విధిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి
- మున్సిపల్ కమిషనర్ వై. రామకృష్ణ
బతుకమ్మ, భీంగల్ : భీంగల్ మున్సిపల్ పరిధిలోని దుకాణందారులు ప్లాస్టిక్ కవర్లను వాడవద్దని, పట్టణ ప్రజలు తమ పరిసరాలను విధిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ వై. రామకృష్ణ సూచించారు. శుక్రవారం
భీమగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా 2024 కార్యక్రమాన్ని పట్టణ కేంద్రంలోని మూడో వార్డులో నిర్వహించి ప్రజలకు తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని మాంసం వ్యాపారులు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని, ప్లాస్టిక్ కవర్లు వాడవద్దని కమిషనర్ హెచ్చరించారు.స్వచ్ఛత హి సేవ కార్యక్రమం ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ భాగ్యస్వాములు కావాలని కోరారు.. పట్టణ ప్రజలందరూ తడి చెత్త పొడి చెత్తను మున్సిపల్ చెత్త వాహనంలోనే వేయాలని అన్నారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్, వార్డ్ కౌన్సిలర్లు,మున్సిపల్ మేనేజర్ నరేందర్. వార్డ్ ఆఫీసర్స్ ఇంచార్జ్ ఆర్ ఐ. రాజేశ్వర్. కె . నవీన్ కుమార్. మాణిక్యం. ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ ఓంకార్. మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.