- మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్
భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మున్సిపల్ పరిధిలో వ్యాపారులు దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు వాడకం ఆపివేయాలని, మున్సిపల్ పరిధిలో ప్లాస్టిక్ కవర్ల వాడకం పూర్తిగా నిషేడించబడిందని మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ తెలిపారు. బుధవారం పట్టణంలోని టిఫిన్ సెంటర్లను కమీషనర్ ఆకస్మికంగా తనికీ చేశారు. టిఫిన్ సెంటర్లలో ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్బంగా ఆయన వ్యాపారస్థులతో మాట్లాడుతూ ముఖ్యంగా హోటల్స్, బేకేరీస్, టిఫిన్ సెంటర్లు, చికెన్, మీట్ సెంటర్లలో ప్లాస్టిక్ కవర్ల వాడకం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని, ఇకపై వాడకం మానివేసి, వాటి స్థానంలో జూట్ కవర్లు వాడాలని సూచించారు.నిషేదించిన ప్లాస్టిక్ కవర్లు వాడితే మున్సిపల్ చట్టం 2019 అనుసారం జరిమానతో పాటు కఠిన చర్యలు తీసుకొంటామని కమీషనర్ హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఓంకార్, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సిబ్బంది ఉన్నారు.