ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షల అంబులెన్స్ సేవలు వినియోగించుకోండి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలోని డిస్టిక్ ఎయిడ్స్ కంట్రోల్ యూనిట్ ఆధ్వర్యంలో పనిచేసే ఎయిడ్స్ పై నిర్ధారణ పరీక్షల అంబులెన్స్ సేవలను జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి.రాజశ్రీ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్ అధికంగా ప్రబలడానికి అవకాశం ఉన్న హైరిస్క్ ప్రాంతాల్లో ముందుగా ఈ అంబులెన్స్ సేవలు ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తారని తెలిపారు. ఇందులో ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు, చికిత్స, ఎయిడ్స్...