Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 March 2025, 6:55 pm Posted by : ramakrishna

ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షల అంబులెన్స్ సేవలు వినియోగించుకోండి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలోని డిస్టిక్ ఎయిడ్స్ కంట్రోల్ యూనిట్ ఆధ్వర్యంలో పనిచేసే ఎయిడ్స్ పై నిర్ధారణ పరీక్షల అంబులెన్స్ సేవలను జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి.రాజశ్రీ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్ అధికంగా ప్రబలడానికి అవకాశం ఉన్న హైరిస్క్ ప్రాంతాల్లో ముందుగా ఈ అంబులెన్స్ సేవలు ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తారని తెలిపారు. ఇందులో ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు, చికిత్స, ఎయిడ్స్ పై కౌన్సిలింగ్, అవగాహన, ఐఇసి ఇతర ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించబడుతుందని తెలియజేశారు. ఈ అంబులెన్స్ లో ఒక ల్యాబ్ టెక్నీషియన్, కౌన్సిలర్ ఉంటారన్నారు. వారికి సపోర్టుగా ఆ ఏరియా ఎయిడ్స్ విభాగ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా కార్యకర్త ఆ కార్యక్రమంలో పాల్గొoటారని తెలిపారు.. ఈ అంబులెన్స్ ద్వారా జిల్లాలో కొత్తగా నమోదయ్యే హెచ్ఐవి కేసులను తగ్గించడమే కాకుండా విస్తృతంగా అవగాహన కలిగించడమే ప్రధాన లక్ష్యం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపిఎం సుధాకర్, సిపిఓ మోఈజ్, నవీన్, స్రవంతి, రాజేందర్ ,నాగరాజు పాల్గొన్నారు.