మరో ఏడు దేశాలపై అమెరికా  ట్రావెల్‌ బ్యాన్‌

వెబ్ న్యూస్, బతుకమ్మ :  మరో ఏడు దేశాలపై అమెరికా  ట్రావెల్‌ బ్యాన్‌ విధించింది.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌  ఇప్పటికే 12 దేశాలపై పూర్తి నిషేధం విధించగా,  దీంతో పూర్తి నిషేధం విధించిన దేశాల జాబితా 19కు చేరింది.  తాత్కాలిక నిషేధ జాబితాలో 15 దేశాలు ఉన్నాయి. అమెరికా రాజధాని వాషిగ్టంన్ డీసీలో ఇటీవల కాల్పుల ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో భద్రతా కారణాల రీత్యా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.