వెబ్ న్యూస్, బతుకమ్మ: అమెరికా – చైనా మధ్య ట్రేడ్ వార్ ముదురుతోంది. కెనాడా, మెక్సికోకు తోడుగా అమెరికా ఉత్పత్తులపై చైనా ప్రతీకార సుంకాలను ప్రకటించింది. సోయాబీన్, పప్పులు, పోర్క్, బీఫ్, అక్వాటిక్ ప్రొడక్ట్స్, పండ్లు, కూరగాయలు, డెయిరీ ప్రొడక్ట్స్సపై మార్చి 10వ తేదీ నుంచి 10శాతం సుంకాలు అమలులోకి వస్తాయని చైనా ఫారిన్ మినిస్ట్రీ తెలిపింది. చికెన్, గోధుమలు, పత్తి సహా మరికొన్ని వస్తువులపై అదనంగా 10 నుంచి 15శాతం సుంకాలు విధిస్తామని వెల్లడించింది.