Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 December 2024, 7:46 pm Posted by : ramakrishna

రాయకూర్ లో ప్రారంభమైన ఉర్సు ఉత్సవాలు

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలోని గుట్ట ప్రాంతంలో గల దస్తగీర్ దర్గా ఉర్సు ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిపారు. గ్రామ ముళ్ళ సయ్యద్ హకీమ్ ఇంటి నుండి గంధలను తీశారు. డప్పు వాయిద్యాలతో ఉర్సును గుట్టపైకి తీసుకెళ్ళి దర్గా వద్ద సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం రాయకూరు గ్రామంలో ఖవాలీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రెండు రోజులపాటు పెద్ద ఎత్తున అన్న శాంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఉర్సు సభ్యులు తెలిపారు. కులమతాలకు అతీతంగా దర్గాను దర్శించుకుంటారు. ఈ ఉర్సు కార్యక్రమంలో రుద్రూర్ ఎస్సై సాయన్న, సయ్యద్ గఫర్, బషీర్, సాజిద్, హైమద్, మంజూర్, ఊర్సు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Ursu ​​celebrations started in Raikur