కమల్ షా బియాబాని దర్గాలో ఘనంగా ఉర్సు ఉత్సవాలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో గల హజ్రత్ కమల్ షా బియాబాని (ఆర్ఏ)లో ఉర్సు ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆల్ హజ్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్ సజ్జద్ నషీన్ ఇంటి నుంచి మంగళవారం సాయంత్రం సందర్ చాదర్ తీసుకుని కంఠేశ్వర్ ప్రాంతంలో ఊరేగించారు. ఈ ఉత్సవాలు రెండు రోజుల పాటు కొనసాగుతాయి. ఈ ఊరేగింపులో దారి పొడవున భక్తులు దర్శించుకుని భక్తితో ప్రార్థనలలో మునిగారు. ఊరేగింపు తిరిగి రాత్రి దర్గాకు చేరుకుని సందల్ మాలి చేశారు. ఆ...