Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 November 2024, 6:50 pm Posted by : ramakrishna

 కమల్ షా బియాబాని దర్గాలో ఘనంగా  ఉర్సు ఉత్సవాలు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్  ప్రాంతంలో గల హజ్రత్ కమల్ షా బియాబాని (ఆర్ఏ)లో ఉర్సు ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆల్ హజ్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్ సజ్జద్ నషీన్ ఇంటి నుంచి మంగళవారం సాయంత్రం సందర్ చాదర్ తీసుకుని కంఠేశ్వర్ ప్రాంతంలో ఊరేగించారు. ఈ ఉత్సవాలు రెండు రోజుల పాటు కొనసాగుతాయి.  ఈ ఊరేగింపులో దారి పొడవున భక్తులు దర్శించుకుని భక్తితో ప్రార్థనలలో మునిగారు. ఊరేగింపు తిరిగి  రాత్రి దర్గాకు చేరుకుని సందల్ మాలి చేశారు. ఆ తర్వాత సమ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాకు  చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాదర్ వంశస్తుడు మహ్మద్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ప్రతి  యేటా ఈ ఉర్సు  ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం మహ్మద్ ఖాదర్ వంశస్తులు అందరూ కలిసి ఆల్ హజ్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్ ను సజ్జద్ నషీన్ గా ప్రకటించారు. ఈ ఉత్సవాల్లో మహ్మద్ అబ్దుల్ అజీజ్, ఖాజామొయినుద్దీన్, జహీర్ హైమద్ ఆలీ, ఎం.ఏ.ఆఫీజ్ , కె. మోయిజ్, ఎం.ఏ.ఖాదీర్, కె.నసీయొద్దీన్, సమీర్ హైమద్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.

Ursu ​​celebrations at Kamal Shah Biyabani Dargah