Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 11:17 am Posted by : ramakrishna

యూరియా లే’దయా‘

భిక్కనూరు, బతుకమ్మ : భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామ సొసైటీ ముందర రైతులు మంగళవారం ఆందోళన చేపట్టారు. రైతులు మాట్లాడుతూ యూరియా కోసం ప్రతిరోజు పడి కాపులు కాస్తున్నామన్నారు. వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో యూరియా అవసరం పెరిగింద న్నారు. సొసైటీ దగ్గరికి ఎస్సై ఆంజనేయులు చేరుకొని రైతులను సముదాయించగా రైతులు మాత్రం యూరియా కావాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరించారు.

Uriah Le'Daya'