Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 September 2025, 8:47 pm Posted by : ramakrishna

భారీ బందోబస్తుతో రైతులకు యూరియా సరఫరా

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని తీర్మాన్ పల్లి గ్రామములో వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు భారీ  పోలీసుల బందోబస్తు పెట్టి రైతులకు యూరియాని  పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కావలసినంత యూరియా అందించడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు,వేసిన పంట ఓ పక్క అకాల వర్షాలతో నాశనం అవుతుంటే మరోపక్క వరి పంట సాగు కోసం అవసరం ఉన్న యూరియాని అందించలేని ప్రభుత్వం పోలీసుల బందోబస్తు పెట్టి ఒక రైతుకు ఒక సంచి మాత్రమే ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని రైతులు వాపోయారు.రైతులకు కావలసిన యూరియా ప్రభుత్వం అందించడం లేదు కానీ బయట అక్రమంగా దొంగతనంగా  అధిక రేట్లకు విక్రయిస్తునారు. ఇది ఎలా సాధ్యం? అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే రైతుల పట్ల కక్షన అని  రైతులు మండి పడుతున్నారు. ప్రతిసారి వారానికి ఒకసారి 250 బస్తాల యూరియా సొసైటీ కార్యాలయానికి తెచ్చి ఎంత మంది రైతులకు విక్రయిస్తారు  ఒక వారం యూరియా అందని రైతులకు డబ్బులు కట్టి టోకెన్ నెంబర్లు ఇచ్చి యూరియా వచ్చిన తర్వాత వారికి యూరియా ఒక బస్తా చొప్పున రైతుకు ఇస్తున్నారు.ఇలా జరగడానికి కారణం ఎవరని రైతులు గుసగుసలాడుతున్నారు.