Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 5:16 pm Posted by : ramakrishna

రైతులకు అందని ద్రాక్షగా మారిన యూరియా…

 

. . . కొంతమంది రైతులకు ఇష్టారాజ్యాంగ యూరియా అందజేత

 

. . . వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతుల ఆందోళన

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రైతులకు యూరియా అందని ద్రాక్షగా మారిందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులకు రుద్రూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కొరత ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో గురువారం రోజున గోదాం వద్ద రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా కొరత పై పలు పత్రికలలో వార్తలు రావడంతో ఒక లారీలో 450 యూరియా బస్తాలను అధికారులు పంపిణీ చేశారు. పెద్ద రైతులకు ఓటీపీలు లేకుండా ఇష్టారాజ్యాంగ యూరియా అందజేస్తున్నారని, కొంతమంది రైతులకు ఓటీపీలు నమోదు చేసి కూడా యూరియా బస్తాలు ఇవ్వకపోవడంతో శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద వివిధ గ్రామాల రైతులు సెక్రెటరీ పై మండిపడ్డారు. అనంతరం కొంతమంది రైతులకు ప్రైవేటు షాపులలో యూరియా బస్తాలు ఇప్పించినట్లు సమాచారం.