రైతులకు అందుబాటులో యూరియా ఎరువులు
నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఎరువుల విషయంలో ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. డిచ్ పల్లి మండలం సుద్దులం సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిడ్డంగిలో అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరువుల కొనుగోలు కోసం వచ్చిన రైతులను కలెక్టర్...