Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 September 2025, 3:19 pm Posted by : ramakrishna

పోలీస్ స్టేషన్ కు చేరిన యూరియా పంపిణీ పంచాయతీ

దోమకొండ, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో యూరియా పంపిణీ కోసం రైతుల పోలీస్ స్టేషన్ లో  బారులు తీరారు. శనివారం దోమకొండ మండలం బీబీపేట సొసైటీకి సంబంధించిన యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రైతులను అదుపు చేయడం కష్టంగా మారడంతో అందరిని పోలీస్ స్టేషన్ కు పిలిచి టోకెన్ల పంపిణీ చేశారు. పోలీస్ స్టేషన్లో  యూరియా కోసం రైతులు క్యూలో కూర్చుండి టోకెన్లు తీసుకున్నారు.

Urea distribution panchayat reaches police station