Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 December 2024, 7:32 pm Posted by : ramakrishna

ప్రొఫెసర్ అబ్దుల్ ఖవి, అహమద్ అలీ ఖాన్ లకు ఉర్దూ అకాడమీ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉర్దూ అకాడమీ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్న ప్రొఫెసర్ అబ్దుల్ ఖవి, అహమద్ అలీ ఖాన్ లను శనివారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం లాగానే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని సందర్భంగా ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిజంలో, రిసర్చ్ విభాగంలో నైపుణ్యం పొందిన సీనియర్ జర్నలిస్ట్ అహ్మద్ అలీ ఖాన్, ప్రొఫెసర్ అబ్దుల్ ఖవి యొక్క సేవలు ఎనలేనివని కొనియాడారు. అందుకొరకే రాష్ట్ర ప్రభుత్వం వీరిని గుర్తించి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వారి వారి విభాగాల్లో ఇచ్చిందని ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు ఆర్థిక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు యూనిస్ ఖాన్, వసంతరావు, డాక్టర్ పులి జైపాల్, నాగ సంతోష్. శ్రీనివాస్, సురేష్, సర్దార్ మంజిత్ సింగ్, అమీమ్ తదితరులు పాల్గొన్నారు.