Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 October 2025, 4:32 pm Posted by : ramakrishna

ఎమ్మెల్యే భూపతి రెడ్డిని పరామర్శించిన ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హుందాన్ నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయం లో పరామర్శించారు. గత నెల 29 న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి లక్ష్మి నర్సమ్మ  మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణించిన విషయం తెలుసుకున్న ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హుందాన్ మంగళవారం నగరంలోని బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ని పరామర్శించారు.  ప్రగాఢ సానుభూతి  తెలిపారు. మృతుకి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.రేకుల పల్లి లక్ష్మీ నర్సమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట గంగారెడ్డి, మునిపల్లి చిన్న సాయరెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.

Urdu Academy Chairman Taher visits MLA Bhupathi Reddy