Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 November 2025, 4:45 pm Posted by : ramakrishna

నేషనల్ హైవే పనులకు పట్టణ ప్రజలు సహకరించాలి

  • ఆర్డీఓ పార్థసింహారెడ్డి

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న నేషనల్ హైవే రహదారి పనులు వేగవంతంగా సాగుతున్న నేపథ్యంలో ఆర్డీఓ శ్రీ పార్థసింహారెడ్డి  స్థానిక  వ్యాపారాలు సముదాయ షాపు యజమానులు మరియు ఇంటి యజమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ హైవే అభివృద్ధి పనులు ప్రజల సౌకర్యం కోసం జరుగుతున్నాయి. అందువల్ల ఎవరూ పనులకు ఆటంకం కలగకుండా సహకరించాలి. ప్రభుత్వ సూచనలను గౌరవించి, తాత్కాలికంగా తమ వ్యాపార సముదాయ షాపులు వ్యాపార సముదాయలేదా ఇళ్ల ముందు ఉన్న సామగ్రిని తొలగించి హైవే పనులకు సహాయం చేయాలని ఆర్డీఓ పార్థ సింహారెడ్డి  తెలిపారు. అలాగే ప్రజలు అధికారుల మధ్య సమన్వయం అవసరమని, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కావడమే పట్టణ పురోగతికి దోహదమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్  ప్రేమ్ కుమార్, నేషనల్ హైవే అధికారులు, ఎల్లారెడ్డి మున్సిపల్ సిబ్బంది, నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Urban residents should cooperate with National Highway work