ఇంజనీరింగ్ కళాశాల మంజూరులో అర్బన్ ఎమ్మెల్యే కృషి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలిసిన నాటి నుండి ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తే ఉత్తర తెలంగాణ  జిల్లాలో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఇంజనీరింగ్  చేయడానికి ఉపయోగకరంగా ఉంటుందని గుర్తించి ఏళ్ల తరబడి విద్యార్థులు డిమాండ్ చేస్తున్న అంశాన్ని ఎమ్మెల్యే గత అసెంబ్లీ సమావేశాలలో ఈ అంశాన్ని  ప్రభుత్వ దృష్టికి తీసేకెళ్లారు....