Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 6:05 pm Posted by : ramakrishna

అర్బన్ ఎమ్మెల్యే ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఆస్తిపన్ను పై ప్రభుత్వం కల్పించిన 5 శాతం రాయితీ రిబేట్ ను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త సద్వినియోగం చేసుకున్నారు. 2026-27 సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను గురువారం రాత్రి ముందస్తుగా చెల్లించారు. ఇంటి పన్నుతో పాటు వ్యాపార సంస్థలకు సంబంధించిన పన్ను మొత్తం రూ. 11.75 లక్షలు చెల్లించారు. మున్సిపల్ శాఖ కల్పిస్తున్న అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.