Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 October 2024, 8:08 pm Posted by : ramakrishna

విజయ హాస్పిటల్ ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే

 

 నిజామాబాద్ , బతుకమ్మ:

నగరంలోని ఖలీల్ వాడిలో నూతన హంగులతో రుపుదిద్ధుకున్న విజయ హాస్పిటల్ ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పా
ల్ సూర్యనారాయణ గుప్త ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందుబాటులో న్యూరో సేవలను, నవజాత శిశువులకు సంబంధించిన వైద్య సేవలు అందించేందుకు హాస్పిటల్ ను పునః ప్రారంభించడం అభినందనీయమన్నారు.

Urban MLA who started Vijaya Hospital

ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్న విజయ హాస్పిటల్ డా. సురేష్ కుమార్ ఆయన తనయుడు న్యూరో సర్జన్ విష్ణు వర్ధన్ లు జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకరా వడం సంతోషదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ ఆసుపత్రి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సురేష్, గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మజ, న్యూరో ఫిజీషియన్ డాక్టర్ విష్ణువర్ధన్, డాక్టర్ సాధన, ప్రముఖ వైద్య నిపుణులు హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Urban MLA who started Vijaya Hospital