విట్టలేశ్వర ఆలయాలను దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఆషాడశుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) పురస్కరించుకుని నగరంలోని నాందేవ్ వాడ, బ్రహ్మపురి లో గల విఠలేశ్వర ఆలయాలను శనివారం అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహావిష్ణువు రూపం విట్టలేశ్వరుడు అన్నారు. ఏకాదశి నుంచి మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయన్నారు. హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఉపవాసం చేసి మహావిష్ణువును ఆరాధిస్తే పాపాలు తొలిగి, ఆయురారోగ్యం,...