Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 5:07 pm Posted by : ramakrishna

విట్టలేశ్వర ఆలయాలను దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఆషాడశుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) పురస్కరించుకుని నగరంలోని నాందేవ్ వాడ, బ్రహ్మపురి లో గల విఠలేశ్వర ఆలయాలను శనివారం అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహావిష్ణువు రూపం విట్టలేశ్వరుడు అన్నారు.

 

Urban MLA visits Vittaleshwara temples.

 

ఏకాదశి నుంచి మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయన్నారు. హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఉపవాసం చేసి మహావిష్ణువును ఆరాధిస్తే పాపాలు తొలిగి, ఆయురారోగ్యం, అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం అన్నారు. మహారాష్ట్ర లో విఠలేశ్వరుడు, రుక్మిణి దేవి ను అత్యధికంగా కొలుస్తారని, ఇందూరులోనూ మహారాష్ట్ర సాంప్రదాయం పాటిస్తారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు ఎర్రం సుధీర్, జగదీష్ కులకర్ణి, నాగోల్ల లక్ష్మీనారాయణ, మల్కాయి మహేందర్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

 

Urban MLA visits Vittaleshwara temples.