. . . నగర అభివ్రద్ధే లక్ష్యం – ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ అర్బన్ అభివృద్ధే లక్ష్యంగా రోడ్లు, డ్రైనేజీ ఇతర అభివృద్ధి పనులకు భూమి పూజలు చేసినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. టి యు ఎఫ్ ఐ డి సి పథకం ద్వారా నగరంలోని 19 డివిజన్ పరిధిలోని రోడ్ నెంబర్ 5 లో భూమి పూజ నిర్వహించినట్లు ఆయన అన్నారు. అదేవిధంగా 20 డివిజన్ ఎల్లమ్మ గుట్ట, 36వ డివిజన్ నాందేవ్ వాడ, 34 వ డివిజన్ మిర్చి కాంపౌండ్, 49వ డివిజన్ శ్రీదేవి టాకీస్ రోడ్డు, 50 డివిజన్ పరిధిలోని గురుద్వార్ దగ్గర, 27వ డివిజన్ పరిధిలోని వర్ని చౌరస్తా ప్రాంతాల్లో, 8 వ డివిజన్ పరిధిలోని బంగారు మైసమ్మ గుడి మరియు సాయి నగర్ రోడ్ నెంబర్ 2, 46వ డివిజన్ పరిధిలోని ముదిరాజ్ గల్లీ ( పోచమ్మ గల్లి ), 44వ డివిజన్ పరిధిలోని ఖలీల్ వాడి ప్రాంతాల్లో భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ నగర అభివృద్ధి లక్ష్యంగా తన నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన రోడ్లు, నాణ్యమైన డ్రైనేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్ల ఏర్పాటుకు ఈ ప్రత్యేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో అర్బన్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులను చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలలో పబ్లిక్ హెల్త్ డిఇ, ఇంచార్జ్ మునిసిపల్ నగేష్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఎఈ లు శివకృష్ణ, శంకర్ పాల్గొన్నారు.

