పదో తరగతి స్టేట్ టాపర్ ని సన్మానించిన అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 596 మార్కుల సాధించిన స్టేట్ టాపర్ గా నిలిచిన కాకతీయ ఒలంపియాడ్ పాఠశాల విద్యార్థిని ఎస్.కృతి ని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ సన్మానించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా విద్యార్థిని రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్ సాధించి పాఠశాల, తల్లిదండ్రులకు, జిల్లాకు,కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిందని కొనియాడారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత లక్ష్యాలను సాధించి ఇందూర్ జిల్లాకు గర్వకారణంగా నిలవాలని...