ఎంపీ అరవింద్ ను సన్మానించిన అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పసుపు బోర్డు సాధించిన తర్వాత మొదటిసారిగా ఇందూరు నగరానికి వచ్చిన పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురిని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లాఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మి నారాయణ, బీజేపీ నాయకులు మఠం పవన్, బట్టికిరి ఆనంద్ పాల్గొన్నారు.