లబ్దిదారులకు సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే
బతుకమ్మ, నిజామాబాద్ సిటి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పంపిణీ చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 71 మంది లబ్ధిదారులకు చెక్ లను పంపిణీ చేశారు. అనంతరం ధన్ పాల్ మాట్లాడుతు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తన కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారిలో 71 మందికి, రూ.18,19,000 రూపాయలు విడతగా...