పూరిజగన్నాథున్ని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇస్కాన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పూరిజగన్నాథ రథోత్సవానికి ముఖ్యఅతిథులుగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడులకు ప్రత్యేక పూజలు నిర్వహించి గుమ్మడికాయలతో దిష్టితీసి రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు గత కొన్ని సంవత్సరాలుగా ఇస్కాన్ ఆధ్వర్యంలో పూరి జగన్నాథ్ రాథోత్సవాన్ని తలపించేలా మన ఇందూర్ లో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరిజగన్నాథుని రథయాత్రకు దర్శించుకోలేని భక్తులకు ఇందూర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి రథోత్సవం స్వామిని దర్శించుకునే...