Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 June 2025, 6:17 pm Posted by : ramakrishna

జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇస్కాన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జగన్నాథ రథోత్సవానికి ముఖ్యఅతిథులుగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడులకు ప్రత్యేక పూజలు నిర్వహించి గుమ్మడికాయలతో దిష్టితీసి రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు గత కొన్ని సంవత్సరాలుగా ఇస్కాన్ ఆధ్వర్యంలో పూరి జగన్నాథ్ రాథోత్సవాన్ని తలపించేలా మన ఇందూర్ లో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరిజగన్నాథుని రథయాత్రకు దర్శించుకోలేని భక్తులకు ఇందూర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి రథోత్సవం స్వామిని దర్శించుకునే అదృష్టాన్ని అందించారని అన్నారు. శ్రీకృష్ణ తత్వాన్ని, మహా భగవత్ సమస్త మానవాళి జీవనానికి గల ప్రాముఖ్యతను గత వారం రోజులుగా భక్తులకు భా సప్తాహం ద్వారా తెలియజేశారని అన్నారు.

Urban MLA Dhanpal starts Jagannath Rath Yatra

శ్రీకృష్ణుడు సకల శుభాలను అందించి భక్తుల కష్టాలను తీర్చేటటువంటి స్వామి నకు దర్శనమిస్తారని అన్నారు. కలియుగంలో పూరిజగన్నాధుని రూపంలో స్వామి భక్తులచే పూజలు అందుకుంటున్నారని ఆ థయాత్రలో స్వామిని దర్శించుకోవడం రథసేవ చేయడం మహాభాగ్యమని అన్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో పూరిజగన్నాథుని అనుగ్రహంతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కేంద్రప్రభుత్వం హిందూ ఆలయాల పునః నిర్మాణానికి పునుకుందని అన్నారు. అందులో భాగంగా పూరి జగన్నాథ్ ఆలయా అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఇందూర్ జిల్లా కేంద్రంలో జగన్నాథ్ ఆలయనిర్మాణానికి స్థలం, ఆలయ నిర్మాణానికి సహకరిస్తానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, ప్రముఖ న్యాయవాది కృపాకర్ రెడ్డి,సిద్ద బలరామ్,భక్తులు పాల్గొన్నారు.

Urban MLA Dhanpal starts Jagannath Rath Yatra