Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 December 2025, 7:06 pm Posted by : ramakrishna

మరాఠి హారిక కు ఆర్థిక సహాయం అందించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

 

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

నిజామాబాద్ నగరంలోని 17 వ డివిజన్  గౌతం నగర్ కు చెందిన మరాఠి హారిక  అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా రూ.20,000 ఆర్థిక సహాయం అందించారు. మరాఠీ  హారిక క్యాటరింగ్ వర్క్ చేస్తూ తన ఇంటిని నడుపుకుంటూ ఉండేది ఎప్పటిలాగే  ఆర్మూర్ ఫంక్షన్ లో క్యాటరింగ్ ముగించుకొని ఆటోలో నిజామాబాద్ వస్తుండగా అంకాపూర్ చౌరస్తా వద్ద ఆటో బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైన మరాఠి హారిక హైదరాబాద్ కు చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. కానీ వారి ఆర్థిక స్తోమత బాలిక కుటుంబ సభ్యులు ఇబ్బంది పడడం చూడలేక గౌతమ్ నగర్ కు చెందిన 17 డివిజన్ మాజీ కార్పొరేటర్ మాయవార్ సాయిరాం ,మాయావార్ సంతోష్ ను కలవగా వారు మరాఠి హారిక తండ్రి వెంకటి కి శుక్రవారం ఉదయం నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారి దగ్గర వెళ్లి వీరి పరిస్థితిని వివరించడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించి ఆ కుటుంబానికి 20,000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త మాట్లాడుతూ వీరి కుటుంబానికి తమ వంతు బాధ్యత గా ఎంతో కొంత సాయం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామ్ కుమార్ ,గోపి తదితరులు పాల్గొన్నారు