Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 1:44 pm Posted by : ramakrishna

జీజీహెచ్ లో మొక్కలు నాటిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

ప్రధాని మోదీ 12సంవత్సరాలు పూర్తి సందర్భంగా పర్యావరణ దినోత్సవం=

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

ప్రధాని గా మోదీ 12సంవత్సరాల పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మొక్కలు నాటారు. శుక్రవారం ఉదయం జిజిహెచ్ ఆవరణలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫ్రో. డా. నాగ మోహన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి నీరు పోశారు..

Urban MLA Dhanpal plants saplings in GGH

ఈ సందర్భంగా శాసన సభ్యులు ధన్ పాల్ మాట్లాడుతూ….ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు ప్రతి ఒక్కరు అమ్మ పేరుతో మొక్కలు నాటాలని అర్బన్ పిలుపునిచ్చారు.. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మొక్కలు నాటడం అంటే రాబోయే తరాలకు ఇచ్చే గొప్ప ఆస్తి అని చెప్పారు. మొక్కలు నాటడం వల్ల ఆక్సిజన్ పుష్టిగా లభిస్తుంది అన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని గుర్తు చేశారు. మిషన్ లైఫ్ పేరుతో ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, నీటి సంరక్షణ పై  అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. పాఠశాలలు కళాశాలలో ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటడం విరివిగా కొనసాగుతుందన్నారు. ప్రధాని మోదీ ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని పిలుపునివ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికే అనేకమంది మోదీ పిలుపు ను పాటిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, కార్పొరేటర్ లు నాగోల్ లక్ష్మీనారాయణ, బంటు ప్రీతి , జ్యోతి , డాక్టర్ హరీష్ స్వామి, డాక్టర్ రాఘవేంద్ర చిద్రావార్, నాయకులు మాయావార్ కృష్ణ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Urban MLA Dhanpal plants saplings in GGH