జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లిని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ సచివాలయంలో నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాదు అర్బన్ నియోజకవర్గం సమస్యలపై మంత్రితో చర్చించి, పదినెల పాలన గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలిసిన టీ యూ ఎఫ్ ఐ డీ సీ, సి డీ పి, నిధులు రాకపోవడంతో వాటిని వెంటనే విడుదల చేయాలనీ కోరుతూ వినతిపత్రం అందజేశారు.