సీపీ సాయి చైతన్యని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

అక్రమ భూ కబ్జాలపై ప్రత్యేక దృష్టి  సారించాలని ఎమ్మెల్యే సూచన నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సాయి చైతన్యను నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో లా &ఆర్డర్ అదుపు చేయడంలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా జరుగుతున్న డ్రగ్స్, గంజాయి, మాదకద్రవ్యాల పై ఉక్కు పాదం మోపి యువతను వాటి బారిన పడకుండా రక్షించాలని అన్నారు, మాదకద్రవ్యాలపై పోలీస్ శాఖ కళాశాల విద్యార్థుల్లో అవగాహన...