కర్మజీవి పుస్తకాన్ని ఆవిష్కరించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాదు నగరానికి చెందిన కవి ఇప్పకాయల సుదర్శన్ రచించిన కర్మజీవి కవితా సంపుటిని శనివారం నిజామాబాదు నగరంలోని మార్కండేయ కల్యాణ మండపంలో నిజామబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ప్రజలను చైతన్య వంతుల్ని చేసేలా కవులు కవిత్వం రాయాలని సూచించారు. కర్మ జీవి అనే కవితా సంకలనాన్ని తీసుకువచ్చి భారతీయ సాంస్కృతిక మూలాలను కవితా మయం చేసిన ఇప్పకాయల సుదర్శన్ అభినందనీయులని ఆయన పేర్కొన్నారు. సమకాలీన అంశాలకు చిత్రిక పట్టేలా...