Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 June 2025, 5:46 pm Posted by : ramakrishna

కర్మజీవి పుస్తకాన్ని ఆవిష్కరించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నిజామాబాదు నగరానికి చెందిన కవి ఇప్పకాయల సుదర్శన్ రచించిన కర్మజీవి కవితా సంపుటిని శనివారం నిజామాబాదు నగరంలోని మార్కండేయ కల్యాణ మండపంలో నిజామబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ప్రజలను చైతన్య వంతుల్ని చేసేలా కవులు కవిత్వం రాయాలని సూచించారు. కర్మ జీవి అనే కవితా సంకలనాన్ని తీసుకువచ్చి భారతీయ సాంస్కృతిక మూలాలను కవితా మయం చేసిన ఇప్పకాయల సుదర్శన్

Urban MLA Dhanpal launches the book Karmajeevi

అభినందనీయులని ఆయన పేర్కొన్నారు. సమకాలీన అంశాలకు చిత్రిక పట్టేలా కవిత్వం రాసిన రచయిత సుదర్శన్ ను  ఎమ్మెల్యే ఈ సందర్భంగా అభినందించారు. కర్మజీవి ద్వారా ఇప్పకాయల సుదర్శన్ జీవితంలోని జీవనసారాన్ని మొత్తం పుస్తకరూపంలో తీసుకువచ్చారని అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకులు సిర్ప లింగం ఆలపించిన సామాజిక గీతాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు గణపతి అశోక్ శర్మ,కాసర్ల నరేష్ రావు,వీపీ చందన్ రావ్,శ్రీమన్నారాయణ,నిజామాబాదు నగర పద్మశాలి సంఘం అద్యక్ష కార్యదర్శులు పెంట దత్తాద్రి,చౌటి భూమేశ్వర్, కోశాధికారి మోర సాయిలు,దత్తోపాసకులు ఇప్పకాయల హరిదాసు తదితరులు పాల్గొన్నారు.

Urban MLA Dhanpal launches the book Karmajeevi