Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 December 2025, 7:53 pm Posted by : ramakrishna

సర్పంచ్ లను సన్మానించినఅర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్  

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

ఇటీవల పంచాయతీఎన్నికల్లో  బిజేపి బలపరచగా గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  ఘనంగా సన్మానించి సత్కారించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీఎన్నికల్లో బిజెపి పార్టీ బలపరిచిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మల్లారంగ్రామ సర్పంచ్ అన్నంగోపి, వార్డు సభ్యులు, బాన్సువాడ  నియోజకవర్గం మోస్రా గ్రామ సర్పంచ్ గా గుత్పే భూపాల్ రెడ్డి  గెలుపోందగాబుధవారంజిల్లా కేంద్రంలోని డి.ఎస్.ఎన్ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్సూర్యనారాయణ  ను వారు మర్యాదపూర్వకంగాకలిశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగాఅర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీ అభ్యర్థులుగెలుపొందాలని ఆకాంక్షించారు.గ్రామ అభివృద్ధికి ముందుండి  అన్నివేళలా తోడ్పడాలని తెలిపారు.. పార్టీఅధిష్టానం బీజేపీ కార్యకర్త నుండి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వరకు ఒకే దృష్టితోచూస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగాగెలిచిన బిజెపి పార్టీ అభ్యర్థులు ఏమాత్రం తలోగ్గకుండా కాంగ్రెస్ పార్టీ అవినీతిప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆయన వారికి సూచించారు. ఇందుకు బిజెపిఅధిష్టానం జిల్లా పార్టీ అధిష్టానం ఎల్లవేళలా బీజేపీ తరఫున గెలిచిన వారికిమద్దతుగా నిలుస్తూ ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండి నడిపిస్తామన్నారు. రాబోయేఎన్నికల్లో కూడా ప్రజలు బిజెపి పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అప్పుడే దేశంసుభిక్షంగా ఉంటుందన్నారు.

Urban MLA Dhanpal felicitates Sarpanchs