నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామప్రకాష్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్బంగా దుబ్బ చౌరస్తాలో మొక్కలను అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పంపిణి చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు జనసంఘ్ వ్యవస్థాపక స్థాపకులైన ముఖర్జీ దేశ సమగ్రత, ఐక్యత కోసం హిందువులలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించడం ద్వారా జాతీయ పునరనిర్మాణం జరుగుతుందనే లక్ష్యంతో భారతీయ జన సంఘ్ ను స్థాపించడం జరిగిందన్నారు. జాతి ఐక్యతను ముప్పుగా భావించే ఆర్టికల్ 370ని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకంచారని అన్నారు.ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహి ఛాలెంగే (ఒకే దేశానికి రెండు రాజ్యాంగలు, ఇద్దరు ప్రధానులు మరియు రెండు జాతీయ చిహ్నలు ఉండకూడదు )అన్నారు .నరేంద్రమోదీ ముఖర్జీ ఆశయాలకు, ఆకాంక్షాలకు అనుగుణంగా 370 ఆర్టికల్ రద్దుచేసి కాశ్మీర్ ను సుందరికరణ చేయడాన్ని మనం చూస్తున్నాం అన్నారు.
ముఖర్జీ పార్టీ కోసం అహర్నిశలు శ్రామిస్తూ తన జీవితాన్నే అంకితం చేసి అతని మరణం కూడా నిర్భంధం లోనే ఒక మిస్ట్రీగా మిగిలిపోయిందన్నారు. ఆ మహనీయుని త్యాగానికి గుర్తుగా బలిదాన్ దివస్ జరుపుకుంటున్నాం అని తెలియజేసారు.బలిదాన్ దివస్ కార్యక్రమంలో భాగంగా పెరుగుతున్న కాలుష్యన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు అమ్మపేరుమీద ఒక్క మొక్కను నాటలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళలకు ఎమ్మెల్యే మొక్కలు పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పంచ రెడ్డి ప్రవళిక ,మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి , దుబ్బ మండల అధ్యక్షులు గడ్డం రాజు, ఇంటలెక్చువల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ కొండా ఆశన్న , తాజా మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్, మహిళా మోర్చా మహిళలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.