Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 December 2025, 6:42 pm Posted by : ramakrishna

దత్త జయంతి ఉత్సవాలలో  అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

 

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

నిజామాబాద్ నగరంలోని పలు ఆలయాల్లో మార్గశిర పౌర్ణమి సందర్భంగా శ్రీ దత్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం జరిగిన దత్త జయంతి వేడుకలలొ  నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..ఎమ్మెల్యే  ధన్ పాల్  దత్త ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తులతో కలసి దత్త స్వామి వారి దివ్య దర్శనం పొందారు.

Urban MLA Dhanpal at Datta Jayanti celebrations

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ: “శ్రీ దత్త స్వామి సేవా భావం ప్రతి మనిషిలో కొనసాగాలనే సంకల్పంతో  నే సర్వసాధారణ ప్రజల శ్రేయస్సు, సమాజ అభివృద్ధి , ధార్మిక ప్రేరణను మా ముఖ్య కర్తవ్యం గా తీసుకుని ముందడుగు వేస్తాను అన్నారు. భక్తులందరికీ సౌకర్యాలు, భద్రత , మౌలిక సదుపాయాలను అందించడం ప్రతి కార్యక్రమంలో మా ప్రాధాన్యత ఇస్తున్నారు. భక్తుల ప్రేమ, విశ్వాసం ఆధ్యాత్మిక శక్తి సమాజానికి కొత్త దిశను చూపిస్తుంది అని తెలిపారు. ఈ సందర్భంలో ప్రజలతో ఒకచోట కలిసే అవకాశం, వారితో క్షణాలు పంచుకునే అవకాశం నాకు లభించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.” అని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఇల్లందుల ప్రభాకర్,  మఠం పవన్, పవన్, బాబీ సింగ్ ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు..

 

Urban MLA Dhanpal at Datta Jayanti celebrations