Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 November 2024, 7:44 pm Posted by : ramakrishna

మేయర్ భర్త పై జరిగిన దాడిని ఖండించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగర మేయర్ భర్త దండు శేఖర్ పై జరిగిన దాడిలో తీవ్ర గాయాలపాలై ప్రూడెన్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శేఖర్ ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు సోమవారం శేఖర్ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు,  నిందితుడు ఏ పార్టీ వారైనా వారి వెనుక ఎవరు ఉన్న కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేసారు. సమస్య ఏదైనా చట్టాన్ని చేతిలోకి తీసుకొని వ్యక్తిగతంగా దాడులకు దిగడం సరైన పద్దతి కాదన్నారు.  తప్పు చేస్తే పోలీస్ వ్యవస్థలు, న్యాయస్థానాలు ఉన్నాయి అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లాఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ ప్రవళిక, శ్రీధర్,నాయకులు భాస్కర్,మఠం పవన్, ఇందూరు సాయి, ముత్యాల సురేష్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.