కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉప్పల్వాయి గ్రామ సర్పంచ్

  ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామ సర్పంచ్ శివాని రాజేందర్ గురువారం ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికీ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండగా, ఉప్పల్వాయి గ్రామం కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త...