Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 5:24 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉప్పల్వాయి గ్రామ సర్పంచ్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామ సర్పంచ్ శివాని రాజేందర్ గురువారం ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికీ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండగా, ఉప్పల్వాయి గ్రామం కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, గృహ జ్యోతి పథకం వంటి అనేక ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందాయని తెలిపారు. గ్రామ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే సంకల్పంతో తాము సమిష్టిగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వెల్లడించారు.

 

Uppalvai village Sarpanch joins Congress party.