హైదరాబాద్, బతుకమ్మ : నిజాన్ని నిక్కచ్చిగా అక్షర బద్దము చేసిన అక్షర శిల్పి దివంగత డా।।వడ్డేపల్లి కృష్ణ రాసిన అంకితం పుస్తకావిష్కరణ నాగోల్ డివిజన్ పరిధిలోని సమతాపురీ కాలనీ లో వారి నివాసంలో జరిగిన కార్యక్రమం లో ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ వడ్డేపల్లి కృష్ణ రాసిన అంకితం పుస్తకం అద్భుతంగా వుంది అని ఆయన అన్నారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శం అని ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలిపారు. ఆయన బాటలో వారి కుమారులు నడిచి ఆయనకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వారి కుమారులు శ్రీకాంత్, శ్రీనాథ్ గంజి సత్య నారాయణ, చిలువేరు రఘు రాం, మాయన సత్యనారాయణ, ఈశ్వర్, పాండు తదితరులు పాల్గొన్నారు.