Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 8:23 pm Posted by : ramakrishna

కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పైలాన్ ఆవిష్కరణ

 

. . . ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

రాష్ట్రంలో హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఎఎం) రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతూ, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో 13.06 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్యాకేజీలుగా 6,092 కిలోమీటర్ల పొడవు గల 441 రహదారులను విస్తరించే కార్యక్రమం పైలాన్ ఆవిష్కరణతో ప్రారంభమైంది. పైలాన్ ఆవిష్కరించిన తర్వాత ముఖ్యమంత్రి స్థానికులను పలకరిస్తూ వారితో కరచాలనం చేస్తూ ముందుకు కదిలారు.